చంద్రబాబు ముందే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు..!

కడప: అధినేత చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు బాహాబహికి దిగడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం కూడా కడప తెలుగు తమ్ముళ్లలో లేకపోయింది.

అయితే చంద్రబాబు కడప జిల్లాలో రెండవరోజు పర్యటనలో భాగంగా.. కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాలలో సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గోన్నారు. ఈ మేరకు కార్యకర్తలు చంద్రబాబుకు తమ సమస్యలు చెప్పుకున్నారు. దీనిలో భాగాంగానే పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై ఉన్న అసంతృప్తిని అధినేత ముందు తెలుగు తమ్ముళ్లు వాపోయారు. నిజాలు చెబుతున్న సమయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కి చెందిన అనుచరులు దాడికి పాల్పడ్డారు. అధినేత చంద్రబాబు వారిస్తున్నా.. శ్రీనివాసులురెడ్డి మనుషులు పట్టించుకోకుండా కార్యకర్తపై దాడి చేయడం గమనార్హం.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్