పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే కూన రవి..
By సుభాష్Published on : 27 May 2020 12:32 PM IST

తహసీల్దార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పోలీసుల ముందు లొంగిపోయారు. వివరాళ్లోకెళితే.. పొందూరు తహసీల్దార్.. కూన రవి తనతో అనుచితంగా మాట్లాడారని తమపై దౌర్జన్యం చేశారని తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుండి కూన రవి అజ్ఞాతంలో ఉన్నారు.
కేసు నమోదు చేసినప్పటి నుంచి.. అంటే నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన బుధవారం.. శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. నాలుగు రోజుల తర్వాత అఘ్ఞాతం వీడిన ఆయన.. టీడీపీ కార్యకర్తలు, అనుచరులతో కలిసి ర్యాలీగా పీఎస్‌కు వెళ్లారు.
Also Read
ఆరోగ్యసేతు:బగ్ కనిపెడితే రూ.3 లక్షలుNext Story