విజయవాడ: ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఇసుక కొరత ఘననీయంగా పెరిగిందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనిలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. భవన కార్మికుల జీవితాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడంలేదన్నారు. అమరావతిలో చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు దోచుకున్నాడని అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ ఎన్ని ఆరోపణలు చేసినా..ప్రజలకు మళ్లీ ఇసుకను అందుబాటులోకి తెచ్చే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.