జక్కంపూడి కుటుంబ దౌర్జన్యాలను సహించం - టీడీపీ నేతలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2019 11:22 AM GMT
జక్కంపూడి  కుటుంబ దౌర్జన్యాలను సహించం - టీడీపీ నేతలు

తూ.గో.జిల్లా: జక్కంపూడి కుటుంబ దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు టీడీపీ నేతలు. విశ్వేశ్వరాయపురం భూ బాధితులకు అండగా ఉంటామన్నారు. విశ్వేశ్వరాయపురంలో పర్యటించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు జక్కంపూడి రాజాపై మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజా సభ్యులు భూ కబ్జాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. భూ కబ్జా ప్రయత్నాలను సహించేదిలేదన్నారు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు .

కమిటీ సోమవారం నాడు విశ్వేశ్వరాయపురం గ్రామానికి వచ్చి బాధితులను పరామర్శించారు. బాధితుల భూములను స్వయంగా పరిశీలించారు. స్థానిక బిసి నాయకులు ఇక్కడి సమస్యలను కమిటీ ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. బాధిత కుటుంబ మహిళలు చెల్లుబోయిన విజయలక్ష్మి, శేషవాణిలను కమిటీ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి పితాని, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాల క్రితం జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మి స్థానిక రైతులకు భూమి విక్రయించిందన్నారు. ఇప్పుడు భూమి విలువ పెరగడంతో దౌర్జన్యంగా ఆక్రమించడానికి ఎమ్మెల్యే రాజా, ఆయన మేనమామ కొమ్ముల సాయి ప్రయత్నించడం శోచనీయమన్నారు.

Next Story
Share it