గుంటూరు : రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లించ‌వ‌ద్దు అంటూ చేప‌ట్టిన ఆందోళ‌న‌లు రోజు రోజుకు ఉదృతం అవుతున్నాయి. రైతులు, మ‌హిళ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి త‌మ నిర‌స‌న‌లు తెలియ‌జేస్తున్నారు. అమరావతి జేఏసీ పేరుతో సాగుతున్న ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా యువ‌కులు గుంటూరు బైపాస్ వ‌ద్ద బైక్ ర్యాలీ నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. అయితే ర్యాలీకి అనుమ‌తి లేద‌ని పోలీసులు అడ్డుకున్నారు.

అదే దారిలో వెలుతున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి త‌న కాన్వాయ్ ను ఆపారు. యువ‌కుల‌ను అడిగి అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకున్నారు. బైక్ ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు తమను ఆపారని తెలిపారు. ఆపడమే కాకుండా తమ బైక్ తాళాలను తీసుకుని ఇవ్వడం లేదని చంద్రబాబుకు యువ‌కులు ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై మండి ప‌డ్డ చంద్రబాబు బైక్ తాళాలు ఇవ్వాలని పోలీసులను నిలదీశారు. అనంత‌రం యువ‌కుల‌తో క‌లిసి చంద్ర‌బాబు కూడా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.