మండలి రద్దుపై చర్చ.. టీడీపీ కీలక నిర్ణయం
By Newsmeter.Network Published on 26 Jan 2020 5:10 PM IST
టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశానికి హాజరు కావొద్దని టీడీపీ నిర్ణయించింది. మండలిలో జరిగిన పరిణామాలను శాసన సభలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని టీడీఎల్పీ భేటిలో అభిప్రాయపడ్డారు. అందుకనే రేపటి సమావేశానికి హాజరుకావద్దని నిర్ణయించారు. ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రలోభాలకు లొంగకపోవడం వల్లే మండలిని రద్దు చేయాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకుందని టీడీపీ నేతలు ఆరోపించారు. కష్టకాలంలో అండగా ఉన్న వారని పార్టీ గుర్తిస్తుందని.. ఎవ్వరూ ప్రలోభాలకు గురికావద్దని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పినట్లు సమాచారం.
మండలి పై రేపు తీర్మానం..!
శాసన మండలిని కొనసాగించాలా? వద్దా? అనే విషయమై సోమవారం చర్చిద్దామని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. మండలి అవసరమా అంటూ జగన్ గురువారం శాసన సభలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలుగా బావిస్తున్నారు విశ్లేషకులు. సోమవారం ఉదయం 9 గంటలకు జరిగే కేబినేట్ భేటిలో మండలి రద్దుకు ఆమోదం తెలిపి.. ఆ తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.