ఆదుకున్న టేలర్.. భారత లక్ష్యం ఎంతంటే..

By Newsmeter.Network  Published on  8 Feb 2020 6:18 AM GMT
ఆదుకున్న టేలర్.. భారత లక్ష్యం ఎంతంటే..

ఆక్లాండ్ లో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్‌ మార్టిన్‌ గుప్టిల్ (79; 79 బంతుల్లో 8 పోర్లు, 3సిక్సర్లు), ఆ జట్టు సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్ (73 నాటౌట్; 74 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించడంతో టీమిండియాకు కివీస్‌ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో కివీస్‌ 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.

టాస్‌ ఓడిన బ్యాటింగ్‌ కు దిగిన న్యూజిలాండ్‌ కు ఆ జట్టు ఓపెనర్లు గుప్టిల్, నికోల్స్ (41; 59 బంతుల్లో 5 పోర్లు) శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు 93 పరుగులు జోడించారు. నికోల్స్ ను చాహల్ ఎల్బీగా పెవీలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌ లో వచ్చిన బ్లండెట్ (22; 25 బంతుల్లో 3 పోర్లు) ను శార్దుల్ వెనక్కి పంపాడు. ఈ దశలో భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లను తీశారు. దీంతో ఓ దశలో న్యూజిలాండ్ 197-8 తో నిలిచింది. ఇక కివీస్‌ ఆలౌట్ కు ఎంతో టైం పట్టదని టిమిండియా ఫ్యాన్స్‌ భావించారు.

ఆదుకున్న టేలర్‌..

ఓ వైపు సహచరులంతా పెవిలియన్‌ కు చేరుతున్న రాస్‌ టేలర్‌ ఒంటరి పోరాటం చేశారు. బౌండరీలు బాదుతూ.. స్కోర్‌ బోర్డును నడిపించాడు. అతడికి పేసర్‌ జెమీసన్‌ (25; 24 బంతుల్లో 1పోర్, 2 సిక్సర్లు) చక్కని సహకారం అందిచారు. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్ కు అజేయంగా 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 273 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ 3, శార్దుల్ 2, జడేజా ఒక వికెట్‌ తో రాణించారు.

Next Story