బొల్లారం..రోడ్డుపై వెళ్తున్న టాటా ఏకోమేట్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..బొల్లారం చెక్‌ పోస్ట్ నుంచి రాజీవ్ రహదారిపై వస్తున్న టాటా ఏకోమేట్ వాహనం మంటల్లో చిక్కుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చాయని డ్రైవర్ చెబుతున్నారు.మంటల ధాటికి వాహనం పూర్తిగా దగ్ధమైంది.వాహనం నడిపే డ్రైవర్, క్లీనర్ చాకచక్యంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. వాహనంలో మంటలు ఎగిసి పడటంతో రాజీవ్‌ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.