క‌రోనాతో వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి క‌న్నుమూత‌

By సుభాష్  Published on  1 Nov 2020 2:28 AM GMT
క‌రోనాతో వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి క‌న్నుమూత‌

క‌రోనా మ‌హ‌మ్మారి సామాన్యుడి నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌దిలి పెట్ట‌డం లేదు. రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండ‌టంతో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే రాజ‌కీయ ప్ర‌ముకులు క‌రోనాతో ఎంద‌రో మృత్యువాత ప‌డ్డారు. తాజాగా క‌రోనాతో మ‌రో మంత్రి క‌న్నుమూశారు. త‌మిళ‌నాడు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి దురైక‌న్ను (73) క‌రోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌.. ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బ‌తిన‌డంతో ప‌రిస్థితి విష‌మించింది. కాగా, దురైక‌న్ను 2006,2011,2016ల‌లో తిరున‌ల్వేలీ జిల్లాలో పాప‌నాశం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజ‌కీయ నాయ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దురై మ‌ర‌ణంతో రాష్ట్రంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న మృతిపై ప‌లువురు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

Next Story
Share it