ఆమె తమిళ కోటీశ్వరి

By అంజి  Published on  22 Jan 2020 4:49 AM GMT
ఆమె తమిళ కోటీశ్వరి

తమిళ టీవీలో ప్రసారమయ్యే ఓ షోలో దివ్యంగురాలైన ఓ మహిళ కోటి రూపాయలు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. తమిళనాడు.. మదురైలోని సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కౌసల్య... పుట్టు మూగ, చెవిటి అమ్మాయి. బాగా చదువుకొని డాక్టరవ్వాలనుకున్న తన ఆసక్తికి తల్లిదండ్రులు అండగా నిలిచారు. కానీ బధిరురాలు కావడంతో ఎంబీబీఎస్‌ చేసే అవకాశం దక్కలేదు. అయితేనేం ఎంబీఏ చదివింది. పెదాల కదలికని మాత్రంమే అర్థం చేసుకునే కౌసల్య తన ఏకాగ్రత, జ్ఞాపక శక్తితో షోలోపాల్గొనే అర్హత సాధించారు. ఈ కోటితో తనలా బాధపడుతున్న బధిరుల సంక్షేమం కోసం వినియోగిస్తానని, నాగర్‌కోయిల్‌ ఉన్న బధిరుల పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తానని తెలిపారు. అలాగే స్విట్జర్లాండ్‌లో పర్యటించాలన్న తన కలను నెరవేర్చుకుంటానన్నారు కౌసల్య. ఈ విజయంపై రాధికా శరత్కుమార్ స్పందిస్తూ కౌసల్య జ్ఞానం, పట్టుదలతో చరిత్ర సృష్టించిందన్నారు. కోటీశ్వరి షో హిందీలో ప్రసారమయ్యే కౌన్ బనేగా కరోడ్పతికి తమిళ వెర్షన్.

Next Story