అప్పుడెప్పుడో నిలిచిపోయిన తమన్నా సినిమా.. రిలీజ్ అవ్వబోతోందా..?

By సుభాష్  Published on  21 July 2020 3:36 AM GMT
అప్పుడెప్పుడో నిలిచిపోయిన తమన్నా సినిమా.. రిలీజ్ అవ్వబోతోందా..?

బాలీవుడ్ లో వచ్చిన కంగనా రనౌత్ సినిమా క్వీన్ ఆమెను స్టార్ హీరోయిన్ ను చేసింది. ఆ సినిమాను దక్షిణాది భాషల్లో పలువురు హీరోయిన్లను పెట్టి రీమేక్ చేయడం మొదలు పెట్టారు. తెలుగులో 'దటీజ్ మహా లక్ష్మి' పేరుతో సినిమాను రీమేక్ చేశారు అప్పట్లోనే..! 2017లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తీ అయ్యయిందని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాను సెన్సార్ కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. 25 కట్స్ తో యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం పలు సినిమాలు ఓటీటీలలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే..! 'దటీజ్ మహాలక్ష్మి' సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మంచి ధరకు ఓటీటీ హక్కులను ఇచ్చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

2013లో కంగనా రనౌత్ నటించిన ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దక్షిణాది భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించిన నిర్మాతలు భారీ ఎత్తున రీమేక్ ను మొదలుపెట్టారు. తమిళంలో కాజల్ నటించిన ఈ సినిమాకు పారిస్ పారిస్ అనే పేరు పెట్టారు. మలయాళంలో మంజిమ మోహన్ నటించింది. ఆ సినిమాకు జామ్ జామ్ అనే పేరు పెట్టారు. కన్నడలో 'బటర్ ఫ్లై' అనే పేరు పెట్టగా.. పారుల్ యాదవ్ కీలక పాత్ర చేసింది. తెలుగు తమిళ వెర్షన్స్ లను 'ఆ' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా.. కన్నడ, మలయాళం రీమేక్ బాధ్యతలను రమేష్ అరవింద్ తీసుకున్నారు. పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్లను కూడా భారీగా లాంచ్ చేశారు. కానీ సినిమాలే ఇప్పటి వరకూ విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమాలకు మోక్షం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఓటీటీలలో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.. చూద్దాం రాబోయే కాలాల్లో ఏమి జరుగుతుందో..! ఇంకా పలువురు స్టార్స్ నటించిన సినిమాలు ఓటీటీలలో త్వరలో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థలు తాము త్వరలో విడుదల చేయబోయే సినిమాలకు సంబంధించిన లిస్టును అభిమానుల ముందు ఉంచాయి.

Next Story