చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ.. ఎందుకంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 May 2020 10:03 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. సినీ రంగంపై కరోనా ప్రభావం, షూటింగ్స్ కి థియేటర్స్ కు అనుమతి ఇస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. సినీ పరిశ్రమలో వున్న సమస్యలపై ఈ సమావేశం లో చర్చించారు.
అలాగే.. ఈ భేటీలో మాక్ షూటింగ్‌పై చర్చించారు. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ లకు మాక్ షూటింగ్ బాధ్యతలు అప్పగించారు. షూటింగ్‌లో లాక్‌డౌన్ నిబంధనలు ఎలా ఫాలో అవుతామన్నదానిపై చర్చ జరిగింది. ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, అల్లుఅర వింద్, సురేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎల్లుండి సీఎం కేసీఆర్‌తో చిరంజీవి బృందం భేటీ కానుంది. ఇదిలావుంటే.. సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు పిబ్రవరిలో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధిపై సినీ ప్రముఖులతో రెండుసార్లు సమావేశమయ్యారు మంత్రి తలసాని.