తమిళనాడు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తనకు సారూప్యత ఉందన్నారు బాలీవుడ్ నటి కంగనా. కంగనా అంటేనే సంచలనం. ఆమె ఏదీ మాట్లాడినా ఓపెన్‌గానే మాట్లాడుతారు. చాలా కాలం తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు కంగనా. మొదట్లో ధామ్ ధూమ్‌ చిత్రంలో నటించారు. తరువాత బాలీవుడ్‌లో బిజీ అయ్యారు అమ్మడు. బాలీవుడ్‌లో తనకూ అంటూ ఓ ముద్ర వేసుకున్నారు. చారిత్రక మూవీ 'మణి కర్ఠిక'లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

Image result for jayalalitha

అయితే.. కంగనా జయలలిత బయోపిక్‌లో నటించబోతున్నారని సమాచారం. 'తలైవి' పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా హైప్ ఉంది. ఈ చిత్రంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కంగనా బాగానే కష్టపడుతున్నారని చెప్పుకుంటున్నారు. అమ్మ పాత్ర కోసం భరత నాట్యంలో కూడా శిక్షణ తీసుకుంటున్నారు. జయలలితలా కనిపించడానికి ప్రత్యేక శిక్షకులను కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Image result for kangana ranaut hd

'అమ్మ' నా మధ్య సారుప్యత ఉంది..కంగనా

జయలలిత తన మధ్య సారుప్యత చాలా ఉన్నట్లు కంగనా చెప్పారు. జయలలిత బయోపిక్‌ రెండు భాగాలుగా రానున్నదని చెప్పారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి చిన్న తనంలోనే జయ సినిమాల్లో కి వచ్చారని కంగనా చెప్పారు. సినీ, రాజకీయాల్లో పురుషాధిక్యాన్ని జయ ప్రశ్నించారని తెలిపింది. తాను కూడా అంతేనని చెప్పింది. నిజాయితీగా జయలలిత పాత్రలో నటించాలని భావిస్తున్నట్లు కంగనా తెలిపారు. ఇందుకోసం తమిళ భాష కూడా నేర్చుకుంటున్నట్లు మీడియాకు చెప్పారు.

Image result for kangana ranaut hd

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story