హైదరాబాద్‌: సైరా నరసింహరెడ్డి సినిమాను వివాదాలు వీడటం లేదు. వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 'సైరా నరసింహరెడ్డి సినిమాపై ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కుటుంబీకులు సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేశారు. అంతేకాదు..హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అనుమతి లేకుండా తమ కుటుంబ కథను సినిమాగా నిర్మించారని ఫిర్యాదు చేశారు. సినిమాపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మొదట సినిమా తమ కుటుంబానికి చూపించిన తరువాతనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమతో ఒప్పందాన్ని అతిక్రమించి సినిమా నిర్మాణం చేపట్టారని ఉయ్యాలవాడ వంశీకులు ఫిర్యాదు చేశారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి వంశీకులు వేసిన పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story