మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల్లో న‌టించి… ఎన్నో సంచ‌ల‌న విజ‌యాలు సాధించినా.. చ‌రిత్ర‌లో నిలిచిపోయే సినిమాలో న‌టించ‌లేదు అనే అసంతృప్తి ఉండేది. అయితే… ఆయ‌న‌ ఎప్ప‌టి నుంచో చేయాల‌నుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి. మ‌గ‌ధీర సినిమాతో రామ్ చ‌ర‌ణ్ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసారో తెలిసిందే. ఆ సినిమా చూసిన‌ప్పుడు చిరంజీవి మైండ్ లో వ‌చ్చిన ఆలోచ‌న‌. చర‌ణ్ కి ఇంత‌టి సినిమా చేసే అవ‌కాశం చ‌ర‌ణ్ కి రెండో సినిమాకే వ‌చ్చింది కానీ… నేను ఆ స్ధాయి సినిమా చేయ‌లేదు. ఎప్ప‌టికైనా చేయాలి అనుకున్నారు.

అయితే… అప్పుడు చిరు రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం వ‌ల‌న సినిమాల‌కు బ్రేక్ ప‌డింది. ఆత‌ర్వాత రాజ‌కీయాలు వ‌ద‌లి మ‌ళ్లీ సినిమాలు చేయాల‌నుకున్నారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చెప్పిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాని చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. అయితే… చిరు రాజ‌కీయాల్లోకి వెళ్ల‌క ముందు ఉన్నసినిమా మార్కెట్ కి ఇప్పుడున్న మార్కెట్ కి చాలా తేడా వ‌చ్చింది. అందుచేత ఇప్పుడు త‌ను సినిమా చేస్తే… ఎంత క‌లెక్ట్ చేస్తుందో తెలుసుకుని ఆత‌ర్వాత భారీ సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా చేయాల‌నుకున్నారు.

ఖైదీ నెం 150 సినిమా రికార్డు స్ధాయిలో క‌లెక్ష‌న్స్ సాధించ‌డంతో ఇక వేరే ఆలోచ‌న లేకుండా సైరా సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అయితే… భారీ తారాగ‌ణంతో.. భారీ బ‌డ్జెట్ తో రూపొందించే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు అయితే బాగుంటారు అని ఆలోచిస్తున్న‌ప్పుడు రామ్ చ‌ర‌ణ్ లో మైండ్ లోకి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. అయితే.. సురేంద‌ర్ రెడ్డి రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తెర‌కెక్కించారు కానీ… భారీ తారాగణంతో… భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన అనుభ‌వం లేదు.

మ‌రి.. రామ్ చ‌ర‌ణ్ ఎందుకు సురేంద‌ర్ రెడ్డిని ఎంచుకున్నారు..? ఏంటా ధైర్యం..? అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను అంద‌రిలో ఇదే ప్ర‌శ్న‌. ఇంకా చెప్పాలంటే… సిన‌మా పై ఎంత న‌మ్మ‌కం ఉన్నా… అంద‌రిలో సురేంద‌ర్ రెడ్డి పైనే ఎక్క‌డో అనుమానం ఉండేది. ఏం చూసి చ‌ర‌ణ్ అవ‌కాశం ఇచ్చాడంటే… చ‌ర‌ణ్ తో సురేంద‌ర్ రెడ్డి ధృవ సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు సురేంద‌ర్ రెడ్డి వ‌ర్కింగ్ స్టైల్ చ‌ర‌ణ్ కి బాగా న‌చ్చ‌డం… చ‌ర‌ణ్ మంచిత‌నం సురేంద‌ర్ రెడ్డిని ఆక‌ట్టుకోవ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఏర్ప‌డింది.

సురేంద‌ర్ రెడ్డి ఈ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గ‌ల‌డు అనేది చ‌ర‌ణ్ గ‌ట్టి న‌మ్మ‌కం. చ‌ర‌ణ్ సైరా సినిమా చేయాల‌ని సురేంద‌ర్ రెడ్డికి చెప్పిన‌ప్పుడు… వెంట‌నే ఓకే చెప్ప‌లేదు. ఎందుకంటే… ఇంత భారీ చిత్రాన్ని చేయ‌గ‌ల‌నా..? అనే ఆలోచ‌న‌తో కొంత టైమ్ తీసుకుని… సైరా న‌ర‌సింహారెడ్డి క‌థ విని ఆత‌ర్వాత ఓకే చెప్పార‌ట సురేంద‌ర్ రెడ్డి. అయితే… క‌థ‌ విన్న‌ప్పుడు సురేంద‌ర్ రెడ్డికి బాగా ఆక‌ట్టుకున్న అంశం… న‌ర‌సింహారెడ్డి వెంట‌నే 9,000 మంది సామాన్య జ‌నం రావ‌డం.. స్వాత్రంత్య్రం కోసం ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కపోవ‌డం. అంతే… ఈ క‌థ పై క‌స‌ర‌త్తు చేసి… నాటి క‌థ‌ను నేటి జ‌నానికి ఎలా చెబితే న‌చ్చుతుంది అని బాగా ఆలోచించి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ఎంతో క‌ష్ట‌ప‌డి సురేంద‌ర్ రెడ్డి ఈ సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించారు. అద్భుత విజ‌యం సాధించి.. చ‌ర‌ణ్ న‌మ్మ‌కాన్ని నిజం చేసారు. సైరా… సురేంద‌ర్ రెడ్డి.!

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.