'సైరా' త‌ర్వాత‌ సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 2:22 PM GMT
సైరా త‌ర్వాత‌ సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

సైరా సినిమాతో అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను మంచి పేరు సంపాదించిన డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి ప్ర‌పంచ వ్యాప్తంగా గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న రిలీజ్ కానుంది. రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ఎంతో శ్ర‌మించి 5 భాష‌ల్లో ఈ సినిమాని రూపొందించారు. అయితే... ఈ సినిమా త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.... యువ హీరో నితిన్ తో సురేంద‌ర్ రెడ్డి సినిమా చేయ‌నున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంద‌ట‌. నితిన్ ప్ర‌స్తుతం ఛ‌లో డైరెక్ట‌ర్ వెంకీ కుడుములతో భీష్మ సినిమా చేస్తున్నాడు. సితార ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాతో పాటు తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వ‌లో ఓ సినిమా, కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నాడు. ఇలా వ‌రుస సినిమాల‌తో నితిన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త నిజ‌మే అయితే... సురేంద‌ర్ రెడ్డితో చేయ‌నున్న సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Next Story
Share it