'సైరా'కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 2:05 PM GMT
సైరాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్ట్

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా న‌ర‌సింహారెడ్డి'. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. అయితే...ఈ సంచ‌ల‌న‌ చిత్రం పై ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వార‌సుల‌తో పాటు తెలుగు యువ సంఘం నాయ‌కులు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌రెడ్డి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం.. హైకోర్ట్ ను ఆశ్ర‌యించ‌డం తెలిసిందే. ఈ రోజు హైకోర్ట్ ఈ కేసు పై విచార‌ణ జ‌రిపి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

మొదట బయోపిక్ అని ఇప్పుడు చరిత్ర తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్ట్ విచార‌ణ చేప‌ట్టింది. ఈ రోజు ఏం చెప్పిందంటే... సైరా చిత్రంలో తాము జోక్యం చేసుకోలేమని... సినిమాను కేవలం వినోద పరంగా చూడాలని.. ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవ్వరు చూపించర‌ని కల్పిత పాత్రలతో చూపిస్తారని చెప్పింది.

గతంలో గాంధీజీ, మొగల్ ల సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన‌ చిత్రాలను హైకోర్ట్ ప్ర‌స్తావించింది. సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని.. ఇప్పుడు సినిమాను తాము ఆపలేమని...తెలియ‌చేస్తూ సైరా నరసింహారెడ్డి చిత్రం పై వేసిన‌ పిటిషన్ ను కొట్టివేస్తున్న‌ట్టు హైకోర్ట్ తెలియ‌చేసింది.

Next Story
Share it