'సైరా' స‌క్సెస్ మీట్ లో షాక్ ఇచ్చిన త‌మ‌న్నా.. ఇంత‌కీ ఏం చేసింది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 1:30 PM GMT
సైరా స‌క్సెస్ మీట్ లో షాక్ ఇచ్చిన త‌మ‌న్నా.. ఇంత‌కీ ఏం చేసింది..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మించిన సంచ‌ల‌న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రూపొందిన 'సైరా' రిలీజైన అన్ని చోట్లా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్ లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా మాట్లాడుతూ... అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పేరు పేరునా చిత్ర యూనిట్ అందరికీ కృతజ్ఞతలు చెప్పింది.

చిరంజీవితో మళ్లీ మళ్లీ నటించాలనుందని ఈ సందర్బంగా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక ఈ అవకాశం ఇచ్చిన సురేందర్ రెడ్డికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదని.. సురేంద‌ర్ రెడ్డి ఎప్పుడు పిలిచినా.. ఒక్క సీన్ లో న‌టించ‌మ‌న్నా న‌టిస్తాన‌ని చెప్పింది. ఈ సినిమాలో ల‌క్ష్మి పాత్ర త‌నకెంతో పేరు తీసుకువ‌చ్చింద‌ని.. చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పింది. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. నిన్ను నిర్మాతగా చూడాలా.? హీరోగా చూడాలా.? ఏం చెప్పాలి రా.. నీ గురించి అని అనేసింది. అంతే... ఒక్కసారిగా అక్క‌డున్న వారిలో కొంత మంది షాక్ అయ్యారు.

వేదిక పై చిరంజీవితో సహా యూనిట్ మెంబ‌ర్స్ అంద‌రూ ఉండగానే చరణ్‌ను ఇలా 'రా' అనేసిందంటే ఆ ఇద్దరి మధ్య స్నేహం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో చ‌ర‌ణ్ తో క‌లిసి త‌మ‌న్నా రచ్చ సినిమాలో న‌టించింది. అప్పటి నుంచే ఈ ఇద్దరి మ‌ధ్య మంచి స్నేహం ఏర్ప‌డింది.

Next Story
Share it