'సైరా' గురించి కామెంట్ చేసిన నారా లోకేష్.. ఇంతకీ ఏమన్నాడు..?
By న్యూస్‌మీటర్ తెలుగు
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ 'సైరా నరసింహారెడ్డి'. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ విన్నా 'సైరా' గురించే చర్చ. ఈ స్ధాయి భారీ చిత్రాన్ని తీసిన అనుభవం లేని సురేందర్ రెడ్డి ఎలా తీస్తాడో అనుకున్నాం కానీ... బాగానే తీసాడు అంటూ అభినందిస్తున్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు... సినిమా రంగానికి చెందిన ప్రముఖులు చిరుని కలిసి అభినందిస్తున్నారు. అయితే... నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ 'సైరా' సినిమా గురించి ట్వీట్ చేయడం విశేషం.
ఇంతకీ ఏమని ట్వీట్ చేసారంటే... తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా 'సైరా'. ఇది చిరంజీవి గారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెర పై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవి గారు. ఎంతో పరిశ్రమించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, చిత్ర దర్శకులు సురేందర్ రెడ్డి గారికి , సాంకేతిక సిబ్బంది.. యూనిట్ మొత్తానికీ హార్దికాభినందనలు అని ట్వీట్ చేసారు.