'సైరా'తో పోటీ గురించి గోపీచంద్ రియాక్షన్ ఏంటో తెలుసా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఎవరైనా సరే.. తమ సినిమాని వాయిదా వేసుకుంటారు కానీ.. గోపీచంద్ 'చాణక్య' సినిమాని 'సైరా' రిలీజైన మూడు రోజుల తర్వాత అనగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నాడని ఎనౌన్స్ చేసారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏంటి చిరంజీవి 'సైరా'తో గోపీచంద్ పోటీపడడం ఏంటి..? ఇది నిజమేనా..? ఏంటా..ధైర్యం..? ఇలా ఇండస్ట్రీలో చాలా ప్రశ్నలు వచ్చాయి.
'చాణక్య' ప్రమోషన్ లో గోపీచంద్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి గోపీచంద్ సమాధానం ఏంటంటే... 'చాణక్య' సినిమాని మే లో విడుదల చేయాలనుకున్నాం. కానీ షూటింగ్ డిలే అవ్వడంతో అక్టోబర్ 3న విడుదల చేయాలనుకున్నాము. అప్పటికి 'సైరా' విడుదల తేదీ ప్రకటించలేదు. 'సైరా' అక్టోబర్ 2 విడుదల అని ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాం అని గోపీచంద్ తెలిపారు.