'సైరా' టీమ్ కి 'అల్లు' వారి పార్టీ.. గొడ‌వ‌లు లేన‌ట్టేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 10:08 AM GMT
సైరా టీమ్ కి అల్లు వారి పార్టీ.. గొడ‌వ‌లు లేన‌ట్టేనా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన సంచ‌ల‌న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ సినిమా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డంతో టీమ్ చాలా హ్యాపీగా ఉంది.

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్ 'సైరా' యూనిట్‌కు పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి మెగా ఫ్యామిలీలోని కొంత మంది హీరోల‌తో పాటు, సైరా చిత్ర యూనిట్, కొంత మంది ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, అఖిల్ అక్కినేని, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, శ్రీకాంత్‌, త్రివిక్ర‌మ్‌, సురేంద‌ర్ రెడ్డి, వంశీ పైడిప‌ల్లి, హ‌రీష్‌ శంక‌ర్‌, సుకుమార్‌, బ‌న్నీ వాసు, జెమినికిర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

దాదాపు రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో.. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా భారీ తారాగ‌ణంతో నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

ఇదిలా ఉంటే... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి బ‌న్నీ రాక‌పోవ‌డం... 'సైరా' ట్రైల‌ర్ పై స్పందించ‌క‌పోవ‌డంతో చిరు, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంది అంటూ వార్త‌లు వ‌చ్చాయి. రీసెంట్ గా 'సైరా' టీమ్ కి అల్లు వారి పార్టీ ఇవ్వ‌డంతో గొడ‌వ‌లు లేవు అని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అయ్యింది.

Next Story
Share it