యూట్యూబ్ లో రచ్చ చేస్తున్న సైరా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 10:28 AM GMT
యూట్యూబ్ లో రచ్చ చేస్తున్న సైరా..!

ఖైదీ నెం. 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నిన్న సాయంత్రం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌ లో రికార్డులు సృష్టిస్తుంది. 3 మినిట్స్ ఉన్న ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉండటంతో పండగ చేసుకుంటున్నారు. చిరంజీవి గంభీరమైన స్వరంతో చెప్పిన డైలాగులను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు ఒదిగిపోయారని ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో తెలుగు ట్రైలర్‌ను 24 గంటల్లోపే 5 కోట్ల మందిపైగా చూసారు. ఇతర భాషలలో కూడా ఈ ట్రైలర్ దుమ్ము దులుపుతుంది. కాగా, కోణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా ..సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, సుదీప్‌, రవికిషన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా వంటి అగ్ర తారలు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇదిలావుంటే ఈ అక్టోబర్ 2 నుండి థియేటర్ లలో సైరా సందడి చేయనుంది.

Next Story
Share it