సైరాతో చిరు రికార్డ్. ఇంతకి.. ఏంటా రికార్డ్..?
By న్యూస్‌మీటర్ తెలుగు
ఇండస్ట్రీలో ఎవరి నోట విన్నా..ఒకటే మాట సైరా... సైరా... సైరా. అంతలా మారుమోగుతోంది. ఈ సినిమా థియేటర్ లోకి ఎప్పుడు వస్తుందా..? ఎప్పుడు చూస్తామా ..? అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెని బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే...ఈ మూవీ రిలీజ్ కాకుండానే చిరు ఓ రికార్డ్ క్రియేట్ చేశారు.
ఇంతకి.. ఆ...రికార్డ్ ఏంటంటే... ఒక చిత్రంలో ఐదు పాటల తప్పనిసరిగా ఉండేవి. ఈ పద్ధతిని తెలుగు నిర్మాతలు నెమ్మదిగా తగ్గించుకుంటున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన 'సైరా 'సినిమా తక్కువ పాటలతో వస్తుంది. ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. చిరంజీవి కెరీర్‌లో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్న మొదటి చిత్రం ఇదే. చిరు సినిమా అంటేనే పాటలు, డ్యాన్సులు ఎక్కువగా ఆశిస్తారు. ఇది చరిత్ర ఆధారంగా నిర్మించిన సినిమా కాబట్టి సందర్భానుసారంగా రెండు పాటలే పెట్టారట..!
ఈ విధంగా తన సినిమాలో కేవలం రెండు పాటలే ఉన్న సినిమాగా 'సైరా'తో ఓ రికార్డ్ క్రియేట్ చేశారు మెగాస్టార్. రెండు పాటలే ఉన్నా.. ఆడియన్స్ కి తక్కువ పాటలు ఉన్నాయి అనే ఫీలింగ్ కలగదట. అంతలా... సినిమాలో లీనమయ్యేలా కథ ఉంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు. మరి.. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద చిరు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో.?