'సైరా'సెకండ్ ట్రైల‌ర్ పై వర్మ రియాక్ష‌న్ చూస్తే షాక్ అవుతారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 7:25 AM GMT
సైరాసెకండ్ ట్రైల‌ర్ పై వర్మ రియాక్ష‌న్ చూస్తే షాక్ అవుతారు..!

మెగాస్టార్ చిరంజీవి 'సైరా న‌ర‌సింహారెడ్డి' ఫ‌స్ట్ ట్రైల‌ర్ ఇటీవ‌ల రిలీజ్ చేసారు. ఈ రోజు సెకండ్ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. అయితే... వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ 'సైరా' సెకండ్ ట్రైల‌ర్ పై ట్విట్ట‌ర్ లో స్పందించారు. ఇంత‌కీ వ‌ర్మ రియాక్ష‌న్ ఏంటంటే...చిరు స్థాయికి తగ్గ చిత్రం తీసి చిరంజీవికి ,తెలుగు ప్రేక్షకులకు గొప్ప బహుమతిని ఇచ్చిన నిర్మాత రామ్ చరణ్ కి ధన్యవాదాలు అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ వ‌ర్మ ట్వీట్ చేశారు.

వివాదాస్ప‌దంగా... స్పందించే వర్మ 'సైరా' ట్రైలర్ పై ఇలా పాజిటివ్ గా ట్వీట్ చేయడం విశేషం. కొంత మంది మెగా అభిమానులు అయితే... ఇది నిజ‌మేనా..? వ‌ర్మ ఇంత పాజిటివ్ గా 'సైరా' పై స్పందించారా ..? అంటూ ఆశ్య‌ర్య‌పోతున్నారు. ఇక ఈ ట్రైల‌ర్ కు సామాన్యుల నుంచే కాకుండా అసామాన్యులు నుంచి కూడా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. దీంతో 'సైరా' దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

చిరంజీవికి జంటగా నయనతార, తమన్నా నటించ‌గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబ‌ర్ 2న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో విడుద‌ల‌ చేస్తున్నారు. మ‌రి... వ‌ర్మ ట్వీట్ పై చ‌ర‌ణ్ స్పందిస్తాడో..లేదో .. చూడాలి.

Next Story
Share it