'సైరా నరసింహారెడ్డి 'సెకండ్ ట్రైలర్ వచ్చేసింది.. ఇంతకీ ఎలా ఉంది..?
By న్యూస్‌మీటర్ తెలుగు
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా నరసింహారెడ్డి'. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలనే 'సైరా' ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. సెకండ్ ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలను ఫస్ట్ ట్రైలర్ పెంచేసింది.అయితే...బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం రెండో ట్రైలర్ రిలీజ్ చేశారని తెలుస్తోంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే... "ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు ..!"అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. "అది మనది.. మన ఆత్మగౌరవం.."అనే డైలాగ్ తో చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం.. "గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు "అని ఎమోషనల్ గా చిరు చెప్పడం. "చంపడమో చావడమో ముఖ్యం కాదు.. గెలవడం ముఖ్యం" అని చిరుకి అమితాబ్ చెప్పడం. చివరిలో "ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే స్వాతంత్ర్యం.. స్వాతంత్ర్యం.. స్వాతంత్ర్యం "తదితర డైలాగ్స్... విజువల్స్.. వావ్ అనేలా ఉన్నాయి.
ఈ సెకండ్ ట్రైలర్ సినిమా పై మరింతగా అంచనాలను పెంచేసింది. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం రికార్డు స్ధాయి కలెక్షన్స్ రావడం ఖాయం అనేలా ఈ ట్రైలర్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే... సైరా సెకండ్ ట్రైలర్ అదిరింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సైరా సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.