హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ‘సైరా ‘సినిమా పై ప్రారంభం నుంచి అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా నిన్న ‘సైరా’ ప్ర‌పంచ వ్యాప్తంగా 5,000 ధియేట‌ర్స్ లో రిలీజైంది. చిరంజీవి 151వ చిత్రంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా తొలి రోజున రూ.38.76 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని ఈరోజు చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ వేడుక‌లో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…’సైరా’ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే రూ.85 కోట్లు గ్రాస్ వ‌సూలు చేసింద‌ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌… ఇలా రిలీజైన అన్ని చోట్లా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. దీంతో ఫ‌స్ట్ డేనే రూ.85 కోట్లు క‌లెక్ట్ చేస్తే… ఇక ఫుల్ ర‌న్ లో ఎంత క‌లెక్ట్ చేయ‌నుంది అనేది ఆస‌క్తిగా మారింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.