హైదరాబాద్: ‘సైరా నర్సింహారెడ్డి’ పిటిషన్‌పై హైకోర్టు లో విచారణ జరిగింది. ‘సైరా’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా ఇవ్వలేదని సెన్సార్ బోర్డ్ కోర్టుకు తెలిపింది. సైరా చిత్రం బయోపిక్ కాదని కోర్ట్‌కు డైరక్టర్ సురేందర్ రెడ్డి తెలియజేశాడు. సోమవారం తమ నిర్ణయం చెబుతామని కోర్ట్‌కు సెన్సార్ బోర్డ్ నివేదించింది. తదుపరి విచారణను కోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.