'సైరా చిరంజీవా' అంటున్న అక్షత శ్రీనివాస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 3:08 PM GMT
సైరా చిరంజీవా అంటున్న అక్షత శ్రీనివాస్

హైదరాబాద్: చిరంజీవి సూపర్ హిట్ సినిమా 'అభిలాష' ఆ అమ్మాయి పేరు. మరో సూపర్ హిట్ సినిమా 'గ్యాంగ్ లీడర్' ఆమె క్యారక్టర్. ఇక మెగా స్టార్ చిరంజీవి అంటే అభిలాషకు ఎంత పిచ్చి అంటే.. 'జై చిరంజీవా' అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత. ఇంతకీ ఈ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? 'గ్యాంగ్ లీడర్' గా ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. 'సురభి 70 ఎం.ఎం' చూడాల్సిందే అంటున్నారు దర్శక,నిర్మాత వై.గంగాధర్.

మెగా ఫ్యాన్ గా అందాల భామ అక్షత శ్రీనివాస్ నటిస్తున్న 'సురభి 70 ఎం.ఎం' చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్-అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ ప్రతిభాశాలి వై.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. 'సురభి 70 ఎం.ఎం' అనే ధియేటర్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్ తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె 'గ్యాంగ్ లీడర్' ఎలా అయ్యింది? వంటి ఆసక్తికర విషయాలు వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు దర్శక,నిర్మాత వై.గంగాధర్.

మెగా ఫ్యాన్ అభిలాషగా నటిస్తున్న యువ కథానాయకి అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'స్వతహా మెగా స్టార్ కు పెద్ద ఫ్యాన్ అయిన నాకు 'సురభి '70 ఎం.ఎం'లో మెగాభిమానిగా ఛాన్స్ రావడం అదృష్టమన్నారు. ఫస్ట్..దర్శక, నిర్మాత గంగాధర్ కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ చిత్రం నా కెరీర్ ను మలుపు తిప్పుతుందని నమ్మకంగా చెప్పగలను. మా బాస్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన 'సైరా' సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" ముగించారు అక్షిత శ్రీనివాస్‌.

Next Story