బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సుశాంత్‌సింగ్‌ మృతికి సంబంధించి పలు కీలక విషయాలు త్వరలో బట్టబయలు కానున్నాయి. ఈ కేసుకు సంబంధించిన శవపరీక్ష నివేదికను ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఈనెల 17న లేదా 20వ తేదీన సీఐబీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌సింగ్‌ శరీరంలోంచి సేకరించిన నమూనాలను ఎయిమ్స్‌ వైద్య బృందం పరిశీలిస్తోంది. డ్రగ్స్‌ వినియోగించాడా.. లేదా అనే అంశంపై వాటికి పలు రకాల పరీక్షలు నిర్వహించనున్నారు.

సుశాంత్ కుటుంబ సభ్యుల ఆరోపణలు, సోషల్‌ మీడియాలో అభిమానులు లేవనెత్తుతున్న సందేహాల ఆధారంగా కూడా శవపరీక్ష నివేదికను అధ్యయనం చేయనుంది వైద్య బృందం. అలాగే మహారాష్ట్ర నుంచి పలు నమూనాలు అందాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 17వ తేదీన మెడికల్‌ బోర్డు అధికారులు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడే నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అప్పుడు వీలుకాకపోతే దర్యాప్తులో పాల్గొన్న అన్ని ఏజన్సీలతో 20న జరిగే సమావేశంలో సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఈనెల 14న ముంబైలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *