హీరో సూర్య న్యూ లుక్.. ఫొటోలు వైరల్

By సుభాష్  Published on  20 Oct 2020 6:53 AM GMT
హీరో సూర్య న్యూ లుక్.. ఫొటోలు వైరల్

విభిన్న కథాంశాలతో ఉండే సినిమాలను చేయడానికి ఇష్టపడే హీరో సూర్య. అందుకనే ఆయనకు తమిళంలో పాటు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన తమిళుల సాహస క్రీడ జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం‘వాడివాసల్‌’ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్యా తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో గ్రామీణ జల్లికట్టు క్రీడాకారుడి పాత్రలో సూర్యా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుండటంతో సూర్యా గ్రామీణ జల్లికట్టు క్రీడాకారుడిగా తన గెటప్‌ను మార్చుకున్నారు. దట్టమైన గడ్డం, పొడవైన మీసాలు, తల వెంట్రుకల్ని దట్టంగా పెంచుకుని గ్రామీణ జల్లికట్టు కీడ్రాకారుడిని తలిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వెరైటీ గెటప్‌ సూర్యా ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర‌రై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని ఓటీటీ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబ‌ర్ 30న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకుని ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Next Story