కరోనా ఎఫెక్ట్‌: సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  16 March 2020 1:19 PM GMT
కరోనా ఎఫెక్ట్‌: సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్‌ సుప్రీం కోర్టుపై కూడా చూపుతోంది. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను నివారించేందుకు త్వరలోనే వర్చువల్‌ కోర్టులు ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఇక వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసులను విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ సోమవారం తెలిపారు. కోర్టు పరిధిలో కరోనా వ్యాప్తికి చెక్‌ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వర్చువల్‌ కోర్టులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా కేసులన్నింటినీ డిజిటల్‌ ఫైలింగ్‌ చేయడం, వర్చువల్‌ కోర్టులను ప్రారంభించడమే నెక్స్ట్‌ టార్గెట్‌ అని చెప్పారు

కాగా, కరోనా వైరస్‌ ఇప్పటి వరకు వందకుపైగా దేశాలలో విస్తరించింది. ఇప్పటి వరకు వైరస్‌ బారిన 5వేలకు పైగా మృతి చెందగా, ఒక్క చైనాలో మూడువేలకుపైగా మృతి చెందారు. కరోనా మృతుల సంఖ్య మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇటలీ ఉంది. ఇక కరోనా ఎఫెక్ట్‌తో ఎమర్జెన్సీ కేసులు మాత్రమే విచారిస్తామని శనివారం సుప్రీం తెలిపింది. అంతేకాదు సోమవారం నుంచి 14 న్యాయస్థానాలకు బదులుగా ఆరు న్యాయస్థానాలు మాత్రమే పని చేస్తాయని తెలిపింది. ఇదే విధంగా ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.

Next Story