సోషల్ మీడియాలో పిచ్చి వేషాలకు తెర పడనుందా..? !!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 6:06 PM GMT
సోషల్ మీడియాలో పిచ్చి వేషాలకు తెర పడనుందా..? !!

సోషల్ మీడియాపై త్వరలో ఆంక్షలు విధించనున్నారా? అసభ్య రాతలు, అభ్యంతరకర ప్రచారాలకు కళ్లెం వేయనున్నారా..? ఇకపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టే అవకాశం ఉండదా..? సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయమేంటీ..?

ఆధునిక కాలంలో సోషల్ మీడియా పాత్ర అసమానం. ఐతే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం మాత్రం సామాజిక మాధ్యమాల్లో కరవవుతోంది. ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం కామన్‌గా మారింది. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలకు ఉన్నట్లుగా కంట్రోలింగ్ ప్యానెళ్లు లేకపోవడంతో కొందరు నెటిజన్లు విజృంభిస్తున్నారు. ఈ పోకడ మరింత పెరిగి పరిస్థితి దిగజారగముందే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలు, పరువున ష్టం కలిగించే పోస్టులను నియంత్రించడానికి చర్యలు చేపట్టింది. 2020 జనవరి 15 నాటి కి కొత్త నిబంధనలు రూపొందించనుంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యూజర్లు పాటించాల్సిన నియమాలకు సంబంధించి జాబితా తయారు చేయనుంది. ఇదే విషయాన్ని మోదీ సర్కారు సర్వోన్నత న్యాయస్థా నానికి కూడా తెలియచేసింది.

కేంద్రానికి సుప్రీం నోటీసులు

సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులను నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలైంది. స్పందించిన కోర్టు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్రానికి నోటీసులు పంపింది. అలాగే, సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయాలంటూమద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేశారు. 2020 జనవరి చివరి వారంలో ఆ పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

సోషల్ మీడియాలో ప్లస్ లు మైనస్ లు

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు పోటీగా సోషల్ మీడియా ఎదిగింది. కొన్ని కొన్ని విషయాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను మించిపోతోంది. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర ప్లాట్‌ఫామ్‌లలో నెటిజన్లు దుమ్ము రేపుతున్నారు. ఏ రకమైన వార్త ఐన సరే క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. భావ వ్యక్తీకర ణకు, ఉద్యమాలకు, పోరాటాలకు, అవకాశాలు పెంచుకోవడానికి, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి... ఇలా చెప్పు కుంటూ పోతే ఎన్నో రకాలుగా సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అవే సోషల్ మీడియా ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.

చేజారిన సోషల్ మీడియా..!

సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో విపరీత ధోరణులు పెరిగిపోయాయి. విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, అసభ్యకర వీడియోలు, అభ్యంతరకర ప్రచారం విజృంభిస్తున్నాయి. స్వేచ్చ ముసుగులో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడం, రెచ్చగొట్టడం, వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చడం, ట్రోలింగ్‌లు పెరిగిపోయాయి. పైశా చికంగా, హేయమైన దృశ్యాలను కూ డా నిరభ్యంతరకరంగా పోస్టు చేస్తున్నారు. ఇక జాతి వ్యతిరేక కార్యకలాపాలైతే యథేచ్చగా సాగుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది.

Next Story