సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో  రూపొందుతోన్నఈ సినిమా గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే…’స‌రిలేరు నీకెవ్వ‌రు’ రన్‌టైమ్ మూడు గంటలకు మించి ఉంటుందని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే… ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త.. ఎంత మాత్రం వాస్త‌వం కాద‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కానందున రన్‌టైమ్ గురించి మాట్లాడటం క‌రెక్ట్ కాదు కానీ.. యూనిట్ మాత్రం ఖ‌చ్చితంగా 2.40 నిమిషాల లోపు ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే టీజ‌ర్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉన్నారు. టీజ‌ర్ లో ర‌ష్మిక పాత్ర‌ను ప‌రిచ‌యం లేదు. అందుచేత త్వ‌ర‌లో రష్మిక కోసం ఒక పాట మరియు మరో టీజర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.