ముఖ్యాంశాలు

  • రిటైర్ట్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తా
  • అన్ని పార్టీల్లో సీఎంగా పార్టీ అధినేతలే ఉన్నారు- రజినీకాంత్‌
  • సీఎం పదవిపై నాకు వ్యామోహం లేదు- రజినీకాంత్‌
  • నేను పార్టీ అధినేతగా మాత్రమే ఉంటా- రజినీకాంత్‌

చెన్నై: బాగా చదువుకున్న విజ్ఞానవంతుడిని సీఎంని చేస్తానన్నారు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌. చెన్నైలోని హోటల్‌ లీలా ప్యాలెస్‌లో రజినీకాంత్‌ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థను సరిచేయకుండా మార్పును కోరుకోవడం సరికాదని ఆయన అన్నారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెడతానని తలైవా ప్రకటించారు. రిటైర్ట్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తాన్నారు. అన్ని పార్టీల్లో సీఎంగా పార్టీ అధినేతలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తనకు సీఎం పదవిపై వ్యామోహం లేదని, తాను పార్టీ అధినేతగా మాత్రమే ఉంటానని చెప్పారు.

రెండేళ్ల కిందటే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పానని గుర్తు చేశారు. జయలలిత మృతి తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందన్నారు. అప్పుడే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాని చెప్పారు. అన్ని పార్టీల్లో 50 ఏళ్లకు పైబడ్డ వాళ్లే ఉన్నారని, యువతకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకే అవకాశాలు వస్తున్నాయన్నారు. అయితే తన పార్టీలో 60 నుంచి 65 శాతం సీట్లు యువతకు ఇస్తానని రజినీకాంత్‌ తెలిపారు. పదవులు ఆశించే వారు తనకు అవసరం లేదన్నారు

తాను 1996కి ఏనాడూ రాజకీయాల గురించి ఆలోచించలేదన్నారు. ప్రజలు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అని అడిగినప్పుడల్లా.. అంతా దేవుడి దయ అంటూ వచ్చానన్నారు.

అంజి

Next Story