బుర్రిపాలెం బుల్లోడి సినీ జీవితం..తల్లి సపోర్ట్ తోనే ఈ స్థాయికి..

By సుభాష్  Published on  31 May 2020 2:15 PM GMT
బుర్రిపాలెం బుల్లోడి సినీ జీవితం..తల్లి సపోర్ట్ తోనే ఈ స్థాయికి..

పాలెంలో జన్మించారు. మొదటి నుంచి సినిమాలపట్ల కృష్ణకు ఉన్న ఆసక్తి ఆయనను సూపర్ స్టార్ గా నిలబెట్టింది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వస్తే అలాంటి వారికి ఎలాంటి కష్టాలుంటాయో తెలుసుకదా. ఆ కష్టాలన్నీ కృష్ణను కూడా వెంటాడాయి.

బుర్రిపాలెం బుల్లోడు సినిమాలపై మోజుతో తల్లితో కలిసి చెన్నపట్నమైతే చేరుకున్నాడు గానీ..ఎంత ట్రై చేసినా సినిమాల్లో అవకాశం రాలేదు. కొడుకు పడుతున్న కష్టం చూడలేకపోయిన తల్లి నాగరత్నమ్మ కూడా సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మా అబ్బాయి చాలా అందగాడు. ఒక్కఅవకాశం ఇవ్వండని అడగటం మొదలుపెట్టారు. ఆ సమయంలో కృష్ణ కుటుంబానికి దూరపు బంధువైన జగ్గయ్య పరిచయమవ్వడంతో ఆయన నటించిన పదండి ముందుకు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.

తర్వాత ఎప్పటికో 1965లో తేనె మనసులు సినిమాలో హీరో గా చేసే అవకాశం వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అదే సంవత్సరం మార్చి 31వ తేదీన విడుదలయింది. రెండో సినిమా కన్నె మనసులు కూడా సుబ్బారావు దర్శకత్వంలోనే నటించినా..గూఢచారి 116 సినిమానే కృష్ణకు మంచి బ్రేకిచ్చిందని చెప్పుకోవాలి. కృష్ణ హీరోగా పరిచయం కాకముందే అంటే 1961లోనే ఇందిరా దేవిని పెళ్లాడారు. మొదటిభార్య ఇందిరా దేవికి ఇద్దరు కొడుకులు, కూతురు. 1969లో విజయనిర్మలను కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయనిర్మల - కృష్ణ సంతానమే నటుడు నరేష్. ముగ్గురు కొడుకులున్నా..కృష్ణ సినీ వారసుడిగా మాత్రం మహేష్ బాబే పేరు గడించారు. మహేష్ అన్నయ్య రమేష్ బాబు కూడా సినిమాల్లో నటించారు కానీ..త్వరగా యాక్టింగ్ కెరీర్ నుంచి తప్పుకున్నారు. ఇక నరేష్ విషయానికొస్తే ప్రస్తుతం మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కు ప్రెసిడెంట్ గా ఉన్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా కృష్ణ నటించారు. ఇప్పటి వరకూ సుమారు 350కి పైగా సినిమాల్లో హీరో, తండ్రి, తాత పాత్రల్లో నటించిన కృష్ణ..2016లో వచ్చిన శ్రీ శ్రీ సినిమా తర్వాత ఇంతవరకూ ఏ సినిమమాలోనూ కనిపించలేదు. 2008లో కృష్ణ ఆంధ్రా యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అలాగే 1974లో అల్లూరి సీతారామరాజు సినిమాకు గాను..బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డును గెలుచుకున్నారు. 1997లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్, 2009లో పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు మన సూపర్ స్టార్ కృష్ణ. కాగా..గతేడాది కృష్ణ రెండవ భార్య విజయనిర్మల గుండెపోటుతో మరణించడంతో కృష్ణ కుంగిపోయారు. ఈ ఏడాది తండ్రి జన్మదిన కానుకగా..మహేష్ బాబు డిజిటల్ ప్లాట్ ఫాం వేదికగా తన 27వ సినిమా టైటిల్ పోస్టర్ ను ఎలాంటి హడావిడి లేకుండా విడుదల చేశారు. తెలుగు సినీ జీవితంలో ఎందరో కన్నె పిల్లల మనసులను కొల్లగొట్టిన ఈ బుర్రిపాలెం బుల్లోడు మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తూ..న్యూస్ మీటర్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

Next Story