సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయ్యింది. ఇంత‌కీ ఏంట‌ది..?

By Newsmeter.Network  Published on  26 Nov 2019 6:00 AM GMT
సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయ్యింది. ఇంత‌కీ ఏంట‌ది..?

సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం 'స‌రిలేరు నీకెవ్వ‌రు'. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వ‌లో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే... మ‌హేష్‌ ఎలాంటి సినిమా చేసినా అందులో ఆయన కటౌట్ కి సెట్టయ్యే స్టిల్స్ చాలానే ఉంటాయి.

ప్రస్తుతం చేస్తోన్న 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాలో కూడా అలాంటి కటౌట్స్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... సంక్రాంతికి విడుదలయ్యే ఈ సినిమా హంగామా అప్పుడే స్టార్ట్ చేసేశారు మ‌హేష్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే మహేష్‌ ఫ్యాన్స్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35MM థియేటర్ వద్ద 81అడుగుల మ‌హేష్ కటౌట్ ని ఏర్పాటు చేశారు.

మహేష్ గత సినిమాలు ఈ థియేటర్స్ లో చాలా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మురారి సినిమాను ఈ థియేటర్ లో ఏకంగా 175రోజులకు పైగా ప్రదర్శించారు. మహేష్ కి సంబందించిన ఏ సినిమా రిలీజ్ అయినా ఈ లొకేషన్ లో కటౌట్ పడాల్సిందే అంటూ ఆయన ఫ్యాన్స్‌ చెబుతున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఇటీవల వచ్చిన టీజర్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. మ‌రి.. ఈసారి మ‌హేష్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Next Story