సెల్ఫీకి నిరాక‌రించిన స‌న్నీ.. ఎందుకంటే..?

By Newsmeter.Network  Published on  30 Jan 2020 10:07 AM GMT
సెల్ఫీకి నిరాక‌రించిన స‌న్నీ.. ఎందుకంటే..?

బాలీవుడ్ ముద్దుగుమ్మ స‌న్నిలియోన్ కు అభిమానులు ఎక్కువ‌. ఆమె ఎక్క‌డ క‌న‌ప‌డినా అభిమానులు సెల్ఫీలు అంటూ ఆమె వెంట ప‌డుతుంటారు. ఇక స‌న్ని కూడా వారి కోరిక‌ను కాద‌న‌కుండా అభిమానుల‌తో క‌లిసి సెల్ఫీలు దిగేది. అయితే తాజాగా ఓ అభిమానికి సెల్ఫీ ఇచ్చేందుకు నిరాక‌రించింది స‌న్నీ.

వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ న‌టి స‌న్నిలియోన్ త‌న భ‌ర్త‌ డేనియల్‌ వెబర్‌తో కలిసి బుధ‌వారం ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు వ‌చ్చారు. స‌న్ని లియోన్ ను చూసిన ఫోటో గ్రాఫ‌ర్లు ఆమెను త‌మ కెమెరాల్లో బంధించారు. ఓ అమ్మాయి స‌న్నితో సెల్ఫీ దిగేందుకు ద‌గ్గ‌రికి వ‌చ్చింది. అయితే స‌న్నీ మాత్రం సారి చెప్పి.. సెల్ఫీకి నిరాక‌రించింది. అయినా ఆ అమ్మాయి అక్క‌డే ఉండ‌డంతో స‌న్నీ త‌న ముఖానికి మాస్క్ వేసుకుని సెల్ఫీ కి ఫోజిచ్చి అక్క‌డ నుంచి వెళ్లిపోయింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇలా స‌న్నీ ముఖానికి మాస్క్ ఎందుకు వేసుకుందా అని అనుకుంటున్నారా.. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని భ‌య‌ప‌డుతోంది. వైర‌స్ భయంతోనే అలా చేసింద‌ట‌. ఇదిలా ఉంటే త‌న భ‌ర్త‌తో క‌లిసి ఓ ఫోటోను ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఆ ఫొటోలో వీరిద్దరూ మాస్క్‌లతో ఉన్నారు. ‘మన చుట్టూ జరుగుతున్న దాని గురించి అజాగ్రత్తగా ఉండకండి.. కరోనా వైరస్‌ పట్ల జాగ్రత్త వహించండి. ’ అంటూ రాసుకొచ్చింది అమ్మడు.

Next Story
Share it