నిజమెంత: నిజాముద్దీన్ మర్కజ్ కు ఈ వీడియోకు సంబంధం ఉందా..?

By సుభాష్  Published on  4 April 2020 7:06 AM GMT
నిజమెంత: నిజాముద్దీన్ మర్కజ్ కు ఈ వీడియోకు సంబంధం ఉందా..?

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చకు వచ్చింది. కోవిద్-19 కు హాట్ స్పాట్ గా మారడంతో అక్కడికి ఎవరెవరు వెళ్లారో వారిని కనిపెట్టడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. తబ్లిగ్ జమాత్ కార్యకర్తల గురించి కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. నిజాముద్దీన్ బిల్డింగ్ లో ఉన్న 2000 మందిని అక్కడి నుండి ఖాళీ చేయించారు. మార్చి 13-15 న అక్కడ నిర్వహించిన కార్యక్రమం కారణంగా పలువురికి వైరస్ సోకినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఆ కార్యక్రమానికి హాజరైన వాళ్లందరినీ జల్లెడ పడుతూ ఉన్నారు. కరోనా వైరస్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా మంది పరీక్షలు చేయించుకోడానికి రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లిన వారి డీటెయిల్స్ కూడా సరిగా లేవని అధికారులు అంటున్నారు.ఈ వార్తలు అలా న్యూస్ లో వస్తున్నాయో లేదో ఇలా మరో వీడియో వైరల్ అవ్వడం మొదలైంది. మసీదులో సామూహిక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ వీడియోలో..! ఆ వీడియోకు “Purposefully sneezing in the mosque to spread the virus in Hazrat Nizamuddin mosque in Delhi”(కావాలనే తుమ్మడం మొదలుపెట్టారని.. వైరస్ ను స్ప్రెడ్ చేయడానికి అలా చేస్తున్నారని ఢిల్లీ లోని హజ్రత్ నిజాముద్దీన్ మసీదులో ఇలా చేస్తున్నారు) అని సారాంశం పెట్టి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు.

పలువురు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేయడం మొదలుపెట్టారు. పలువురు ప్రముఖులను ఈ వీడియోకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ట్విట్టర్ లో రీట్వీట్ చేయడం.. సోషల్ మెసేజింగ్ యాప్ లలో ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు.

నిజమెంత:

అంతా అబద్ధమే.. ఈ వీడియోలో కరోనా వైరస్ ను వ్యాప్తి చేయాలని వారు ప్రయత్నిస్తూ ఉన్నారని చెబుతోందంతా పచ్చి అబద్దం. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రెమ్ లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ ద్వారా వెతకగా.. ఈ వీడియో గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇంతకు ముందే పలువురు ఈ వీడియోను షేర్ చేశారు.

పాకిస్థానీకి చెందిన యూజర్ కూడా ఈ వీడియోను షేర్ చేశాడు. కరోనా వైరస్ పాకిస్థాన్ లో ఎంటర్ అయ్యింది అని అతడు పోస్ట్ చేశాడు. జనవరి 30, 2020న ఈ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేశారు.Islami Lara اسلامی لارہ అనే యుట్యూబ్ ఛానల్ లో జనవరి 29, 2020న అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో అక్కడ ఉన్న వాళ్లంతా గట్టిగా శ్వాస తీసుకోవడం.. తలను పైకి కిందకు ఆడించడం చూడొచ్చు. అలా చేయడాన్ని జికర్ లేదా జకీర్ అని అంటారు. సూఫీ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు చేసే ప్రార్థనల్లో ఇది కూడా ఒకటి.

ఈ వీడియో ఆరిజిన్ దొరకలేదు కానీ.. ఈ వీడియోకు ఢిల్లీకి చెందిన నిజాముద్దీన్ మర్కజ్ కు ఎటువంటి సంబంధం లేదు. భారత్ లో కరోనా వైరస్ ను ప్రబలించడానికి వారు చేస్తున్న ప్రయత్నం అన్నది 'పచ్చి అబద్ధం'

వైరల్ అవుతున్న మెసేజీల్లో ఏ మాత్రం నిజం లేదు.

Next Story
Share it