ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించిన 'యోధుడు'
By సుభాష్ Published on 23 Jan 2020 6:32 AM GMTముఖ్యాంశాలు
స్వాతంత్ర్యం కోసం 11 సార్లు జైలుకు
అహింసా మార్గంలో అణచివేయడానికి 20 ఏళ్ల పోరాటం
భారత జాతీయ సైనిక దళానికి జీవం పోసిన నేతాజీ
భారత స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నమైన ఏకైక వీరుడు
ఆంగ్లేయులపై బుల్లెట్ లా దూసుకువచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన 1887, జనవరి 23వ తేదీన జన్మించారు. నేతాజీ ఒడిషా లోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ న్యాయవాది, తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి దేవి. బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోనూ విద్యనభ్యసించారు. ఇక భారతమాత కన్న వీరులలో నేతాజీ ఒకరనే చెప్పాలి. మన భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో బోస్ స్థానము మర్చిపోలేనిది. నేతాజీ 1920లో భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై నాలుగవ ర్యాంకు సాధించాడు. ఇంగ్లీష్‌లో అత్యధిక మార్కులు సాధించారు. 1921లో ఏప్రిల్ నెలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుంచి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగం చురుకైన పాత్ర నిర్వహించారు.
ఒక వైపు గాంధీజీ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం కొనసాగిస్తుంటే.. సుభాష్ చంద్రబోస్ మాత్రం ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి తరిమి కొట్టవచ్చని నమ్మిన మహనీయుడు. చంద్రబోస్ రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా.. గాంధీతో సిద్దాంత పరమైన అభిప్రాయ భేదాల వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీజీ అహింసా వాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని చంద్రబోస్ భావన. బోస్ అభిప్రాయంతో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయుల కారణంగా జైలు శిక్షను అనుభవించాడు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆంగ్లేయులపై..
1939లో రెండు ప్రపంచ యుద్ధం మొదలైన సందర్భంలో ఆంగ్లేయులను దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయమని భావించిన బోస్.. యుద్ధం మొదలు కాగానే ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జన్మనీ, రష్యా, జపాన్ తదితర దేశాల్లో పర్యటించారు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేపూరితమైనవి.
1945, ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడని ప్రకటన వెలువడినప్పటికీ, ప్రమాదం నుంచి నేతాజీ బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని అప్పట్లో పుకార్లు వచ్చాయి. భారత ప్రజల్లో ఎంతో ధైర్యాన్ని నింపిన యోధుడు నేతాజీ, అలాంటి ముద్దు బిడ్డ మన దేశంలో జన్మించడం మన అదృష్టం. మనమంతా స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ వారి అడుగు జాడల్లో నడవాలి.
స్వాతంత్ర్యం కోసం 11 సార్లు జైలుకు..
స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో నేతాజీ11 సార్లు జైలుకెళ్లాడు. 1944, ఫిబ్రవరి 4న ఆంగ్లేయుల ఏకాధిపత్య పిడికిలి నుంచి భారత్ ను రక్షించేందుకు నేతాజీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ బయలుదేరారు. ఆంగ్లేయుల చెర నుంచి భారతదేశాన్ని కాపాడి స్వాతంత్ర్యం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దిన వ్యక్తి సమయోధుడు నేతాజీ.
ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన నేతాజీ
స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. చివరి ఘట్టంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ శక్తుల సహాయంతో భారత స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నమైన ఏకైక వీరుడు సుభాష్ చంద్రబోస్. ఈ సందర్భంగా నేతాజీ చేసిన పోరాటంలో ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించాడు. అహింస మార్గం ద్వారానే స్వాతంత్ర్యం లభించదని ఆయుధాలను చేతపట్టుకుని స్వాతంత్ర్యాన్ని సాధింవచ్చనే నినాదాన్ని లేవనెత్తారు.
అహింసా మార్గంలో అణచివేయడానికి 20 ఏళ్ల పోరాటం
బ్రిటిష్ ఏకాధిపత్యాన్ని అహింసా మార్గం ద్వారానే అణచివేయడానికి నేతాజీ 20 ఏళ్ల పాటు పోరాడారు. తన 23వ ఏటనే భారత కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరాడు. 41వ ఏటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రెండేళ్ల పాటు ఎంపికయ్యాడు.
1941లో నేతాజీ హౌస్ అరెస్ట్
అహింసా మార్గం ఆంగ్లేయులకు ఏమాత్రం అర్థం కాదని తెలుసుకున్న చంద్రబోస్.. 1941వ సంవత్సరంలో గృహ నిర్భంధంలో ఉన్న నేతాజీ .. బ్రిటిష్ ప్రభుత్వ కన్నుల్లో ఉన్న కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. రష్యా, ఆప్గనిస్థాన్ మార్గం ద్వారా జర్మనీకి చేరుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయాన్ని సద్వినియోగం చేసుకుని జర్మనీ - ఇటలీల సహాయంతో హిట్లర్‌తో చర్చలు జరిపారు.
భారత జాతీయ సైనిక దళానికి జీవం పోసిన నేతాజీ
అయుధ యుద్ధాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో 1943లో జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాల్లోని భారత సైనిక దళాలకు నేతాజీ జీవం పోశారు. 1944, ఫిబ్రవరి 4న బర్మా రాజధాని రాంకూన్ నుంచి భారత సరిహద్దులకు భారత సైన్యం ప్రయాణం అయింది. ఈ క్రమంలో భారత జాతీయ సైనిక దళ దాడుల ధాటికి బ్రిటిష్ సైన్యం ఏమాత్రం తట్టుకోలేకపోయింది. ఈ సైన్యం ఇమ్మాల్ నగరానికి చేరుకుని ఇమ్మాల్ సైనిక స్థావరాన్ని ముట్టడించింది. ఈ పోరాటంలో ఇరువర్గాల మధ్య కొనసాగింది. ఇక సైనిక పోరాటంలో బ్రిటిష్ సైన్యం పరాజయం పాలైంది.