హైదరాబాద్ : ఆటగాళ్లను కనీసం గౌరవించాలనే కనీస సోయ అధికారులకు లేకుండా పోయింది.

కబడ్డీ ఆడే విద్యార్ధినుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తుంది.పలు జిల్లాల నుంచి కబడ్డీ ఆడే విద్యార్థినులు హైదరాబాద్ వచ్చారు. వారిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి..? . కనీసం ఆ బాధ్యతను కూడా అధికారులు మరిచారు. గొడ్లను తరలించినట్లు ఆటో ట్రాలీలో తరలించి బాధ్యతారాహిత్యాన్ని అధికారులు నిరూపించుకున్నారు.

అధిక బరువు తో వెళ్తున్న ట్రాలీ ఆటో చిక్కడపల్లి పోలీసుల కంట పడింది. కబడ్డీ విద్యార్దినులను ట్రాలీలో తరలించడం చూసి పోలీసులు విస్తుపోయారు. అంతేకాదు..విద్యార్దుల జీవితాలతో ఆటలు ఆడొద్దని అధికారులను ఘాటుగానే హెచ్చరించారు. మరోసారి ఇలా చేస్తే పై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని కూడా సంబంధిత ఆఫీసర్లను పోలీసులు హెచ్చరించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story