సంగారెడ్డి జిల్లా: ఐఐటీ హైదరాబాద్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంపూటర్ సైన్స్‌ మూడో సంవత్సరం చదువుతున్న సిద్ధార్ళ అనే యువకుడు..ఉదయం క్యాంపస్‌ హాస్టల్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సిద్ధార్థకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సిద్ధార్థ మృతి చెందాడు. వెంటనే క్యాంపస్‌ యాజమాన్యం హైదరాబాద్‌ కుత్భుల్లాపూర్‌లోని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

అయితే ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు .. సిద్ధార్థ తన ఆవేదనను కొందరు స్నేహితులకు మెయిల్‌ చేసినట్లు సమాచారం. అయితే తానూ చదువులో వెనబడుతున్నానని, అందుకే ఈ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ మెయిల్ రాసి ఉన్నట్లు స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story