విజయవాడ: కార్పోరేట్‌ కాలేజీల విద్యార్థుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా మరో విద్యార్థి ఏకంగా కాలేజీ హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గొల్లపూడి నారాయణ జూనియర్‌ కళాశాల క్యాంపస్‌ హాస్టల్లో చోటుచేసుకుంది.

అయితే గొల్లపూడిలోని నారాయణ జూనియర్ కళాశాలలో గట్ల రామాంజనేయ రెడ్డి ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఏమందో తెలియదు కానీ..హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకున్నట్లు తోటి విద్యార్థులు గమని కాలేజీ యాజమాన్యానికి సమచారం అందించారు. యాజమాన్యం వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అనంతరం విద్యార్థిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే తమ కుమారుడు మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.