నేడు అకాశం కనువిందు చేయనున్న 'ప్రతిబింబ' చంద్రగ్రహణం

By సుభాష్  Published on  5 Jun 2020 9:26 AM IST
నేడు అకాశం కనువిందు చేయనున్న ప్రతిబింబ చంద్రగ్రహణం

ఈ ఏడాది జనవరి నెలలో తొలి చంద్రగ్రహణం చూశాం.. మరోసారి భారతీయులకు కనువిందు చేసేందుకు మరోసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది. జూన్‌ 5 (నేడు) రాత్రి 11.15 గంటలకు ప్రతిబింబ చంద్రగ్రహణం ఏర్పడనుంది. శనివారం తెల్లవారుజామున 2.34 గంటల వరకూ కొనసాగుతుంది. ఇక ఈ చంద్రగ్రహణంను స్ట్రాబెర్రీ మూన్ ఎక్లిప్స్‌ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు.

సాధారణంగా చంద్రగ్రహణాలు మూడు రకాలుగా ఉంటాయి. అలాగే ఈరోజు ప్రతిబింబ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక జులై, నవంబర్‌ నెలలో రెండు ప్రతిబింబ చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణ, ప్రతిబింబ చంద్రగ్రహణం. సూర్యుడి కాంతి నేరుగా చంద్రుడి ఉపరితలం మీదపడకుండా భూమి అడ్డుగా వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై కొంత భాగం పడుతుంది.

భారత కాలమాన ప్రకారం చంద్రగ్రహణం జూన్ 5న రాత్రి 11 గంటల 15 నిమిషాలకు మొదలవుతుంది. ఇది మొత్తం 3 గంటల 19 నిమిషాల పాటు ఉంటుంది. సరిగ్గా మరుసటి రోజు అంటే జూన్ 6వ తేదీ తెల్లవారు జామున 2 గంటల 34 నిమిషాలకు ముగుస్తుంది. ఇక పూర్తి స్థాయి చంద్రగ్రహణం అర్థరాత్రి 12గంటల54 నిమిషాలకు కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్రగ్రహణాలు మూడు రకాలు:

చంద్రగ్రహణాలు మూడు రకాలుగా ఉంటాయి. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, ప్రతిబింబ చంద్రగ్రహణం.

సంపూర్ణ చంద్రగ్రహణం (బ్లడ్‌ మూన్‌) అంటే..?

ఇక చంద్రగ్రహణాల్లో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని బ్లడ్‌ మూన్‌గా పిలుస్తారు. గ్రహణం సమయంలో చంద్రుడు, భూమి నీడలోకి వెళ్లడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమికి చేరి, తర్వాత చంద్రుని మీద పడుతుంది. దాంతో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే బ్లడ్‌ మూన్‌ అని పిలుస్తుంటారు.

పాక్షిక చంద్రగ్రహణం అంటే..?

పాక్షిక చంద్రగ్రహణం సమయంలో చంద్రుడి ప్రతిబింబం కొద్దిగా వచ్చిచిన్నగా కనిపిస్తుంది. కానీ మూడు గ్రహణాలు మాత్రం సరళ రేఖలో సమలేఖనం చేస్తే నీడ కనిపిస్తుంటుంది. దీనినే పాక్షిక చంద్రగ్రహణం అంటారు.

ప్రతిబింబ చంద్రగ్రహణం (స్ట్రాబెర్రీ మూన్ )అంటే:

పౌర్ణమి రోజే జరిగే ప్రతిబింబ చంద్రగ్రహణం. సూర్యుడి కాంతి డైరెక్టుగా చంద్రుడి ఉపరితలం మీద పడకుండా భూమి అడ్డుగా వచ్చిన సమయంలో భూమి నీడ చంద్రుడిపై కొంత భాగం మాత్రమే పడుతుంది. సూక్ష్మ నీడ ఉన్న ప్రాంతమైనందున చిన్నగా కనిపిస్తుంటుంది. దీనినే ప్రతిబింబ చంద్రగ్రహణం (స్ట్రాబెర్రీ మూన్ ఎక్లిప్స్‌) అంటారు.

ప్రతిబింబ చంద్రగ్రహణం (జూన్‌5) ఏయే దేశాల్లో కనిపిస్తుంది

ఇక జూన్‌ 5న కనిపించే ప్రతిబింబ చంద్రగ్రహణం ఏయే దేశాల్లో కనిపిస్తుందో శాస్త్రవేత్తలు వివరించారు. జూన్‌ 5,6 తేదీ మధ్య అకాశంలో కనువిందు చేసే చంద్రగ్రహణం ఆసియా, ఆఫ్రికా, యూరోప్‌ దేశాల్లో కనిపిస్తుంది. ఈ సమయంలో చంద్రుడికి, సూర్యుడికి మధ్యన అడ్డుగా వస్తుంది. అంటే సూర్యుడి నుంచి వెలుతురు చంద్రడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. ఆ సమయంలో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. ఇది ఎప్పుడూ పౌర్ణమి రోజే జరుగుతుంది. ఇక చంద్రగ్రహణంను నేరుగా వీక్షించవచ్చని, టెలిస్కోప్‌ లాంటివి అక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Next Story