వింత ఆకారంలో గబ్బిలం.. భారీగా జనాలు

By సుభాష్  Published on  7 Oct 2020 3:05 AM GMT
వింత ఆకారంలో గబ్బిలం.. భారీగా జనాలు

సాధారణంగా గబ్బిలాలను చాలా మంది చూసే ఉంటారు. కానీ కుక్కలాంటి తల, పొడవాటి రెక్కలున్న గబ్బిలాలను ఎప్పుడైన చూశారా..? అలాంటి గబ్బిలమే యాదాద్రి జిల్లాలో కంటపడింది.

అయితే అప్పుడప్పుడు కొన్ని వింత ఆకాలంలో కనిపిస్తుంటాయి. ఆనోటా.. ఇనోటా విన్న ప్రజలు భారీ ఎత్తున చూసేందుకు వస్తుంటారు. అలాంటిది మోత్కూరులో ఓ వింత ఆకాలంలో గబ్బిలం కనిపించడంతో దానిని చూసేందుకు భారీ ఎత్తున జనాలు వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర దేవాలయం వద్ద వింత ఆకాలంలో గబ్బిలం కనిపించింది. దీని ఆకారం కుక్క తలలాగా ఉండి, పొడవాటి రెక్కలను కలిగి ఉండటంతో జనాలు ఈ వింత పక్షిని చూసేందుకు తరలివచ్చారు. గబ్బిలం ఇలాంటి ఆకారంలో కనిపించడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Strange Bat 1

Next Story