విజయను సజీవ దహనం చేసిన సురేష్ వాంగ్మూలంలో ఏం చెప్పాడు..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2019 12:27 PM IST
ముఖ్యాంశాలు
- పట్టా ఇవ్వనందుకే నిప్పంటించా..!
- బతిమిలాడినా పట్టించుకోలేదు..!
- నిందితుడు సురేశ్ వాంగ్మూలం
వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎమ్మార్వోను అగ్నికి ఆహుతి చేశానని నిందితుడు సురేశ్ చెప్పాడు. సోమవారం 60 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యుల సమక్షంలో సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు.
ఎమ్మార్వోను ఎంత బతిమలాడినా తనకు పట్టా ఇవ్వలేదని చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేశానని, ఆమె స్పందించకపోవడంతో తిరిగి పెట్రోలు డబ్బాతో కార్యాలయానికి వెళ్లానని చెప్పాడు . మొదట తనపై పోసుకొని, తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగులబెట్టానని చెప్పాడు.
Next Story