ప్రేమోన్మాది ఘాతుకం.. లెక్చరర్‌ పై..

By Newsmeter.Network  Published on  4 Feb 2020 1:47 PM IST
ప్రేమోన్మాది ఘాతుకం.. లెక్చరర్‌ పై..

ఆమె ఓ కళాశాలలో లెక్చరర్‌ గా పని చేస్తోంది. అతనికి పెళ్లై ఏడు నెలల కొడుకు ఉన్నాడు. నిత్యం లెక్చరర్‌ వెంట పడుతూ ప్రేమించమని వేదించేవాడు. ఆమె అతని ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. ఆ యువకుడు మహిళా లెక్చరర్ పై పెట్రోలు పోసి నిప్పంటించాడు. స్పందించిన స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మహరాష్ట్ర వార్థా జిల్లా నందోరి చౌక్‌ లో జరిగింది.

దడోరా గ్రామానికి చెందిన అంకిత(26) కు అదే గ్రామానికి చెందిన వికేశ్(27) తో పరిచయం ఉంది. ప్రేమించమని వేధించేవాడు. కాగా అతనికి పెళ్లి అయ్యింది. భార్య, ఏడు నెలల కొడుకు ఉన్నాడు. అతని ప్రవర్తన నచ్చక రెండేళ్ల నుంచి ఆమె అతడిని దూరం పెట్టసాగింది. ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం కళాశాల వద్ద కాపు కాసిన వికేశ్‌ అంకితతో ఘర్షణకు దిగాడు. అంకిత తన మాట వినక పోయే సరికి తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ఆమె పై పోసి నిప్పంటించాడు. స్థానికులు స్పందించే లోగా అక్కడ నుంచి బైక్‌ పై పరారయ్యాడు. అంకిత కు అంటుకున్న మంటలను ఆర్పిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిచించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌ కు తరలించారు. ఈ దాడిలో నిందితుడికి మరో ఇద్దరు సహాకరించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రేమ విఫలం కావడంతోనే వికేశ్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని జిల్లా ఎస్పీ తెలిపారు. పెళ్లైయినా అతడు వేధింపులు మానలేదని, గత ఏడాది ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడని చెప్పారు. అతని వల్లే గతేడాది అంకిత వివాహా జీవితం విచ్ఛిన్నమైపోయినట్లు ఆమె బంధువు తెలిపారు. ఘటన పై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, బాధితురాలికి అండగా ఉంటామన్నారు.

Next Story