ఫిబ్రవరి అలా ఎందుకు మిగిలిపోయిందంటే..

By రాణి  Published on  29 Feb 2020 1:45 PM GMT
ఫిబ్రవరి అలా ఎందుకు మిగిలిపోయిందంటే..

ఫిబ్రవరి నెలలో సాధారణంగా 28 రోజులుంటాయి. లీపు సంవత్సరం అయితే 29 రోజులుంటాయి. కానీ ఈ నెలలోనే 28 లేదా 29 రోజులెందుకుంటాయో మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా ? మీకు వచ్చిన అనుమానానికి సమాధానం కూడా మీకు తెలుసనుకుంటున్నారు కదా. అదేదో స్కూల్లో చెప్పే పాఠాల్లో ఉన్నట్లుగా భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది..365 రోజులతో పాటు మరో పావు రోజును తీసుకోలేం కాబట్టి..ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నాలుగు పావుల్ని కలిపి ఒకరోజు అవుతుంది..అనే కదా మీకు తెలిసిన లీపు సంవత్సరం వెనకున్న అసలు కథ.

Untitled 4 Copy

కానీ ఇప్పుడు మీరు ఈ కథను చదివితే ఆశ్చర్యపోతారు. అదేంటో ఒకసారి చదివేద్దాం..

రోమన్ క్యాలెండర్ జూలియస్ క్యాలెండర్ విషయంలో 46వ శతాబ్దానికి చెందిన పరిశోధకుడు, విద్యావేత్త శాక్రోబోస్కో చెప్పిన సిద్ధాంతం ప్రకారం..రోమన్ సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి జూలియస్ సీజర్. అతడు ఆనాటి రాజకీయాల్లో, సైన్యంలో కీలక బాధ్యతల్ని చూసేవాడు. అంతేకాదు..అతను సాహిత్య, చరిత్రకారుడు కూడా. జూలియస్ హయాంలోనే రోమన్ క్యాలెండర్ లో మార్పులు చేసి కొత్త క్యాలెండర్ ను రూపొందించాడు. ఈ క్యాలెండర్ లో జనవరి 30, ఫిబ్రవరి 29, మార్చి 30, ఏప్రిల్ 29, మే 30, జూన్ 29, జూలై 30, ఆగస్టు 29, సెప్టెంబర్ 30, అక్టోబర్ 29, నవంబర్ 30, డిసెంబర్ 29 రోజులుగా ఉండేవట. అంటే రోమన్ క్యాలెండర్ ప్రకారం ఏడాదికి మనకు 354 రోజులేనన్నమాట. అయితే..జూలియస్ సీజర్ వాటిలో కొన్ని మార్పులు చేశాడు. ఏడాదికి 11 రోజులను అదనంగా అంటే ప్రతి నెలకు ఒక్కొక్క రోజునూ కలిపాడు. ఫిబ్రవరిలో మాత్రం 29 రోజులే ఉంచాడు. ఎందుకంటే దానికి అదనంగా మరొక రోజొచ్చి చేరితే 30 రోజులవుతాయని అలాగే వదిలేశాడు. అలా జూలియస్ క్యాలెండర్ తయారైంది.

Untitled 5 Copy

ఇదంతా ఒక ఎత్తైతే..సీజర్ తర్వాత రోమన్ సింహాసనాన్ని అధిష్టించింన ఆగస్టస్ కు జూలియస్ సీజర్ తయారు చేసిన క్యాలెండర్ నచ్చలేదు. జూలియస్ పేరుతో ఉన్న జులై లో 31 రోజులుంటే..అగస్టస్ పేరుతో ఉన్న ఆగస్టులో 30 రోజులే ఉండటం ఆయనకు మింగుడు పడక..ఫిబ్రవరిలో ఉన్న 29వ రోజును తీసుకొచ్చి ఆగస్టులో కలిపేశాడు. దీంతో పక్క పక్కనే ఉన్న జులై, ఆగస్టు నెలలు 31 రోజులు కలిగి ఉంటే..అతి తక్కువ రోజులున్న నెలగా ఫిబ్రవరి మిగిలిపోయింది. ఈ క్యాలెండర్ నే ఇప్పటికీ మనం వాడుతున్నాం. అయితే శాక్రోబోస్కో సిద్ధాంతం తప్పని చెప్తూ..అనేక సిద్ధాంతాలు వచ్చినప్పటికీ శాక్రో సిద్ధాంతాన్ని ప్రజలు ఫాలో అయ్యారు.

Next Story