నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు.. మూడు గేట్లు ఎత్తివేత

By సుభాష్
Published on : 19 Aug 2020 8:10 PM IST

నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు.. మూడు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో నీటితో కళకళలాడుతోంది. దీంతో అధికారులు జలాశయం మూడు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువన నాగార్జున సాగర్‌లోకి వదులున్నారు. జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా, భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో నీటిని దిగువన వదులుతున్నారు.

కర్ణాటకలో కురిస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి గత పది రోజులుగా భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలు గరిష్టస్థాయికి చేరుకోవడంతో నీటిని దిగువన విడిచిపెడుతున్నారు. కాగా, శ్రీశైలం కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక గేట్లు ఎత్తడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా వచ్చి వదులుతున్న నీటిని తిలకిస్తున్నారు.

Next Story