తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2019 11:45 AM ISTకర్నూలు జిల్లా: ఎగువ ప్రాజెక్టుల నుంచి శ్రీశైల జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా మాత్రమే.. సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. నీటినిల్వలు 215.8070 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 884.70 అడుగులు నీటిమట్టం నమోదు కాగా.. జలాశయ నీటినిల్వ సామర్థ్యం 213.8824 టీఎంసీలుగా నమోదయ్యింది.
ఈ జలాశయానికి ఇన్‌ఫ్లో 1,71,794 క్యూసెక్కుల కాగా... ఔట్ ఫ్లో 1,24,886 క్యూసెక్కులుగా ఉంది. అయితే దీని ద్వారా అధికారులు కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ..ఈ జలాశయం నుంచి 69,012 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. ఈ మేరకు అధికారులు డ్యాం 2 రేడియల్ క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,874 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.