నూత‌న 'లంకాధిప‌తి' ఆయ‌నే.!

By Medi Samrat  Published on  17 Nov 2019 11:17 AM GMT
నూత‌న లంకాధిప‌తి ఆయ‌నే.!

ముఖ్యాంశాలు

  • మహీంద్ర రాజపక్స సోదరుడే గోటబయ రాజపక్స
  • టర్మినేటర్ గా ప్రాచుర్యం

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద్ర రాజపక్స సోదరుడు గోటబయ రాజపక్స విజయం సాధించారు. అభిమానులు అత‌నిని 'టర్మినేటర్' అనే పేరుతో పిలుస్తారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. కౌంటింగ్ మొద‌టి రౌండు నుండి రాజపక్స ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

ఎస్‌ఎల్‌పీపీ త‌రుపున బ‌రిలో ఉన్న గోటబయ రాజపక్స.. తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై విజ‌యం సాధించారు. రాజపక్సే గెలుపును సాయంత్రానికల్లా అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలావుంటే రాజపక్స గెలిచినట్టు ఇటు ఎస్ఎల్‌పీపీ, యూఎన్‌పీలు ధృవీకరించాయి.

Next Story